Sunday, 18 June 2017

నే వేసే అడుగు లోన జాడలన్ని నాన్నవిలే
నే చేసే పనులలోన ముద్రలన్ని నాన్నవిలే
నాన్న లాగ బ్రతకాలని చేతకాని పిచ్చి ఆశ
నే నడిచే బాటలోన నీడలన్ని నాన్నవిలే
తనుసత్యం తనుధర్మం తనున్యాయం ఏమైనా
తనవారే పరులు అయిన బాధలన్ని నాన్నవిలే
తనకంటూ ఉంచుకోక తనకోసం దాచుకోక
అంతా తన వారనుకును ఆశలన్ని నాన్నవిలే
బ్రతుకంటె మంచి పంచు నలుగురినీ పలకరించు
పరహితమే తనబ్రతుకను ధ్యాసలన్ని నాన్నవిలే
ఆతండ్రికి కొడుకు కదా ఆగుణములు శ్రీ కెరుకే
అర్ధించిన ఆదరించు బాసలన్ని నాన్నవిలే
... శ్రీ నివాస్
మనుషులు కలుసుకోకుండా వున్నట్టే
కలుసుకున్నపుడు కూడా ఉంటే ఏం?
ఆనందం తెలిసిపోదా కళ్లల్లో...
గుచ్చి గుచ్చి ప్రశ్నలు ... అనుమానాలు...సోదా చూపులు అవసరం కాదు
పదాల్లో లేని భాషతో
పలకరించాలి.....

Thursday, 13 April 2017

హాయ్ ....
1st ఏప్రిల్ 2017 న లైఫ్ లోమర్చిపోలేని రోజు..
THE GREAT RAJA RAVI VARMA(1848-1906)  పెయింటింగ్ ఎక్సిబిషన్ కి వెళ్ళాను.. 
అయన గీసిన బొమ్మలు చాల అంటే చాల బాగున్నాయ్.... 
ఆరోజే సాయంత్రం ఆ బొమ్మల సంబంధించి మీటింగ్ కూడా జరిగింది.
నిజానికి అయన గీసిన బొమ్మలు కొన్ని మాత్రమే మన దేశం లో ఉన్నాయంటే. అందులో ఒకటో రెండో మైసూర్ ప్యాలెస్ లో ఉన్నాయంట.
నిజానికి ఆయనకు బొమ్మలంటే ప్రాణం. ఆయన గీసిన బొమ్మలు అన్ని మన పురాణాల్లో నుండి ఉహించి గీసినవే... 
నె వెళ్లిన ఎక్సిబిషన్ గేలరీ ని ఎస్టాబ్లిష్ చేసింది ఆయన మనువరాలు THE PRINCES OF RUKMINI VARMA, ఆవిడను కూడా కలిసాను, మరియు నేను గీసిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, నేను చేసిన వినాయకుడి మట్టి విగ్రహాలు చూయించాను. బాగున్నాయ్ అని చెప్పింది అంతే. నిజానికి ఏమైనా సజ్జెషన్స్ ఇస్తుంది అనుకున్న.. కానీ అక్కడ వీలు కాలేదు.
రుక్మిని వర్మ గారు రాజా రవి వర్మ గారి కూతురి కూతురు అంటే యన ముని మనవరాలు . వాళ్ళు  ఉండేది బెంగళూరు లోనే..  రుక్మిణి వర్మ గారు శరీరం పై కాంతిపడే ఛాయ ని ఎక్సక్ట్  గీయడం లో సుప్రసిద్ధురాలు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈవిడ గీసిన బొమ్మలకున్న జ్యువలరీ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను...
ఈ కిoది బొమ్మ ఆవిడా గీసిందే....

ఈ బొమ్మ 8feets  ,

ఈ కింది బొమ్మ రుక్మిణి వర్మ గారి నానమ్మ...అంటే రాజా రవి వర్మ కూతురు.


ఇపుడు రాజా రవి వర్మ గీసిన బొమ్మల గురించి మాట్లాడుకుందాం...

మీకు లక్ష్మి బాంబు ల పైన ఉండే లక్ష్మి దేవి బొమ్మ గుర్తుందా. అది గీసింది మన రాజా రవి వర్మే.
ఒకప్పుడు మనకు గుడిలోకి ప్రవేశం లేదంట. 1930 తర్వాత గుడి ప్రవేశం జరిగిందట. అప్పటివరకు దేవుడు అంటే  ఒక నమ్మకం మాత్రమే. ఎవ్వరూ కూడా దేవుడి రూపాన్ని చూసింది లేదు. ఎందుకంటే దేవుడి&దేవత రూపాలను వేదాల్లో మాత్రమే ఉండేది... ఆ వెదాలు బ్రాహ్మణులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఎవరికీ తెలియదట దేవుడంటే ఎలా ఉంటాడో... దాదాపు 1860 -1880 మధ్యలో జైపూర్ మహారాజు  సరస్వతి దేవి & లక్ష్మి దేవి  బొమ్మని గీయమని  అడిగాడట.  అపుడు యన గీసిన బొమ్మలే ఈరోజు మనం చూస్తున్న దేవత రూపాలకు మూలం. 

ఇదిగో ఆ లక్ష్మి బొమ్మ ఇదే... ఇక్కడ ఫోటోలు తీయకూడదు.. కానీ మెం చాటుగా తీసాం. టాప్ రైట్ కార్నర్ లో  జూమ్ చేసి చూడండి లక్ష్మి దేవి కనపడ్తది.

ఆ బొమ్మే ఇపుడున్న అన్ని దేవత బొమ్మలకు మూలం.. అంటె మొట్ట మొదట గీసిన  దేవత బొమ్మ.
ఈ కింది ఫోటో లో లక్ష్మి దేవి.... సరస్వతి దేవి ఫోటోలు కూడా ఉన్నాయ్ చూడండి....

పైన రెండు సరస్వతి బొమ్మలున్నాయ్ చూసారా  
ఇపుడు మీరు చూస్తున్నవి లిథోగ్రాఫ్స్ అంటారు...  
నకలు సృష్టించాలి అంటే ఇప్పటి లాగా జిరాక్స్ మెషిన్ లు లేవు, ఆ టెక్నాలజీ లేదు. ఒక సున్నపు రాయి పైన చేయి తో 1cm ఎత్తులు వంపులుగా బొమ్మ ఆకారం చెక్కి వాటికీ రంగులు అద్ది , దానిపైన పేపర్ ని గట్టిగా ఒత్తి పడితే ఆ ఆకారం పేపర్ మీద పడేది, అలా ఒక్కొక్క రంగుని ప్రింట్ చేసేవారు పేపర్ మీద. ఇపుడున్న యన బొమ్మలు.. మనం చూస్తున్నవి అన్ని అలా చేసిన లిథోగ్రాఫ్స్,1885 రవి వర్మ కి ఒక ప్రింటింగ్ ప్రెస్ ముంబై లోఉండేది. ఆ ప్రింటింగ్ ప్రెస్ 1895 లో ఒక జర్మన్ కి అమ్మేశాడు.ఆ యెదవే అయన బొమ్మల్నితన బిసినెస్ కి వాడుకుని,అవి ఇంకెవరు వాడకూడదని ఒర్జినల్స్ ని కాల్చి బూడిద చేసారు. ఆ తర్వాత అంటె 1960  లో ఆ ప్రెస్ అగ్ని ప్రమాదం లో పూర్తిగా కాలిపోయింది.

బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లక్ష్మి, సరస్వతి బొమ్మల్ని బ్రిటన్ అండ్ లండన్ కంపెనీస్  వాళ్ళ సబ్బుల్ని అమ్ముకోడానికి, అగ్గిపెట్టెలు లు అమ్ముకోడానికి, పండ్లు అమ్ముకోడానికి వాడుకున్నారు.

THE RAJA RAVI VARMA HERITAGE FOUNDATION  లో ఉన్నవి కేవలం 130 బొమ్మలు మాత్రమే...
దాంట్లో మహాభారతం , భాగవతం, దమయంతి బొమ్మలు, మేనకా బొమ్మలు, కేరళ సంస్కృతీ కి చెందిన మహిళల బొమ్మలు, ఉన్నాయ్. 
అక్కడ బాగా నచ్చిన బొమ్మ శ్రీకృష్ణుడిది..
బృందావన స్త్రీ లు కృష్ణుడిపైన  కంప్లైంట్ చేయడానికి యశోద దగ్గరికి వొస్తరు.. అపుడు యశోద చైర్ లో కూర్చుని వాళ్ళు చెప్పింది  వింటూ ఉంటుంది, కృష్ణుడేమో ఆ చైర్ వెనకాల తొంగి తొంగి చూస్తాడు... ఆ బొమ్మ చాల బాగా నచ్చింది...


మొత్తం లో రవి వర్మ బొమ్మలు అందుబాటులో ఉన్నవి కేవలం 500 -600  మాత్రమే... అవి కూడా చాల వరకు విదేశాల్లో మ్యూసియం లో ఉన్నాయ్. మన దేశం లో 200  మించి లేవు.
అంటె విదేశీయులకు ఉన్న కళాదృష్టి, సంస్కృతిని కాపాడుకునే జ్ఞానం మన దేశీయులకు లేకుండా పోయింది.

నిజానికి ఒక బొమ్మ గీస్తే తెలిసేది అది గీయడానికి  ఎంత కష్ట పడతారో... 
ఎన్ని విధాలుగా ఆలోచిస్తారో... 
కాల్చే వాడికేం తెలుస్తుంది , 
అది ఒక బొమ్మ అని మాత్రమే తప్ప.. 

అవి కాల్చేశారు అని చెప్పినపుడు న కళ్ళలో నీళ్లు తిరిగాయి... నిజంగా..

మన కళల్ని, సంస్కృతిని మనమే కాపాడుకుందాం..
       

Thank you ...




Monday, 7 November 2016

నీద్ర రావడం లేదని...

అలా ఆరు బయటకు వెళ్లాను...

కబుర్లు చెప్పే గాలులు..

ఊసులు చెప్పే ఆకులు...

కథలు చెప్పే జాబిలమ్మా...

నాకు ఎదురు పడ్డాయి అవి కూడా నిద్దర రాకతిరుగుతున్నాయి...

కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు.రాలుతున్నా పువ్వులను పోగేసుకుంటూ..

రేయంతా నీవు నా తోడుగా..

కాలమే తెలియని పరుగులు పెడుతూ గడిపా...


                                          - శ్రీనివాస్  చారీ 


Saturday, 15 October 2016




ఎంత అందమైనది ఈ ప్రపంచం......
 అందులోను ఒక స్త్రీ....
తల్లి పురిటి నొప్పులు భరించి మనల్ని కంటుంది...
జాగ్రత్తగా పెంచి పోషించి మనల్ని పెద్ద చేస్తుంది
తప్పు చేస్తే వారిస్తుంది.. తప్పటడుగులేస్తే తాట తీస్తుంది..
తప్పిపోతే ఆరా తీస్తుంది....

పెళ్ళీడుకొచ్చేదాకా ఎన్నో విషయాలు వంటింట్లో నొక్కి.. వినకపోతే ఒకటి పీకి చెప్తుంది....
తనకి మాట రాకూడదు  కదా....
తన కూతురు అత్తారింట్లో ఎలా ఉండాలో చిన్నప్పుడే తెలియజేస్తుంది...
తన అనుభవాలతో కలిపి....

వసంతం లో  విరగ బూసే సమయాన...
ఇంట్లో ఉండే కష్టాలు చూసి 
ఇల్లు గడవడం కోసం తను  సాయంగా ఉండాలనుకుంటుంది నాన్నకు...
ఎలాగైనా బయటకే పంపేది అలవాటవుతుందంటూ పంపిస్తుంది బాధతో తల్లి ..
నాలుగు నాలుగు వైపులా చూసే 'ఆ ' ఆశ చూపుల మొన్నల్లో నలుగుతూ ..
తనని తానూ కాపాడుకుంటూ... నడుస్తూ ఉంటుంది ....
చూసే 'ఆ ' ఆశ చూపుల  బావాలు మాటల్లో చెప్పలేక పోయినా మనసులో నాటుకున్నాయ్...
ఈ జనాలు... వాళ్ళ ఆలోచనలు... 
తన ప్రయాణానికి అడ్డంకులు కాకూడదని....

అడుగులేస్తూ... తీస్తూ... పరుగెడుతోంది  ఈ ప్రపంచం లోకి... 

తన చెరను పట్టే వాడి కోసం భయపడుతోంది....
ఎక్కడ ఏ  కీచకుడు పొంచి ఉన్నాడో అని...
ఎక్కడ ఏ అగాధం ఎదురొస్తుందో అని...

నిజంగా స్త్రీ కి నిరంతరం ఆపద నీడలా వెండిసిస్తుందేమో...

ఘనంగా పెళ్లి అయినా ... కొసరంత గర్వం కూడా లేకుండా సేవ  చేస్తుంది....
సూటి పోటీ మాటల తూటాలు ఒంట్లో దిగుతున్నా...
గుంభనగా ఉంటోంది....
అనుమానించే పక్షులు.. ఆకర్షించే నక్షత్ర రాక్షసులు...

అన్నీ...
అన్నీ...
తన జీవితంలో భాగం అయ్యాయేమో....
ఇంకెన్నాళ్లు ఓర్చుకోవాలో...
అందుకే నిరంతరం మండే అగ్ని ఆమె కళ్లల్లో కనపడుతోంది.. 
చిన్నారుల నవ్వుల్లో తన ప్రపంచాన్ని వెతుక్కుంటోంది...
తన భవిష్యత్ వారసత్వ పటాన్ని మనసులో నింపుకుంటుంది...
అన్యాయం అక్రమం .... అరాచకం... ప్రేమ....
అన్నీ భాగం అయ్యాయి...

అందుకేనెమో  
ఆమె దుర్గ దేవై చీల్చి చెండాడుతుంది..
గౌరి దేవై భర్తలో సాగ భాగం అవుతుంది..
గంగై ప్రేమతో పొంగుతుంది తన పిల్లల మీద....


                                                                           


                                                                                                                  -- శ్రీనివాస్ చారీ

 .

Friday, 14 October 2016

హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ?? 
అసలు నీకు అంత లేవేలేంటోయ్ ?? 
అయినా నేనంటే అంత అలుసోయ్??
నీకెందుకు మరీ ఇంత బెట్టు
నాపై కోపంగా వుంటే తిట్టు 
కల్లోకోస్తా నిన్ను కవ్విస్తా హత్తుకుపోతా
నీ పాటే వింటే ప్రణయ తాపం 
నీ మాటే మధుర గీతం 
నీ చూపే ప్రణవ నాదం 
నీ మోమే చంద్రుని ప్రతిబింబం 
నీ నీడై తోడై ఉంటా 
నా జన్మ కాచుకుంటా 
గుండెల్లోన చేరి గుచ్చి చంపకోయ్ 
కళ్ళతోటి నన్ను కాల్చకోయ్ 
నీ మాటలే పూ తోటలై నా ముంగిట విరిసేనోయ్
ఆ పూలనే పూల మాలగా నీకై నే మలిచానోయ్ 
హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ?? 
నీ దిండు పంచుకుంటా 
నా ప్రేమ పంచుకుంటా 
చల్లగాలై తాకి సేద తిర్చవా 
వెండి వెన్నెలవై వడిలో వాలవా
నా ఊపిరివై నాలో నిండిపోవా

హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ??