Sunday, 18 June 2017

నే వేసే అడుగు లోన జాడలన్ని నాన్నవిలే
నే చేసే పనులలోన ముద్రలన్ని నాన్నవిలే
నాన్న లాగ బ్రతకాలని చేతకాని పిచ్చి ఆశ
నే నడిచే బాటలోన నీడలన్ని నాన్నవిలే
తనుసత్యం తనుధర్మం తనున్యాయం ఏమైనా
తనవారే పరులు అయిన బాధలన్ని నాన్నవిలే
తనకంటూ ఉంచుకోక తనకోసం దాచుకోక
అంతా తన వారనుకును ఆశలన్ని నాన్నవిలే
బ్రతుకంటె మంచి పంచు నలుగురినీ పలకరించు
పరహితమే తనబ్రతుకను ధ్యాసలన్ని నాన్నవిలే
ఆతండ్రికి కొడుకు కదా ఆగుణములు శ్రీ కెరుకే
అర్ధించిన ఆదరించు బాసలన్ని నాన్నవిలే
... శ్రీ నివాస్

No comments:

Post a Comment