Monday, 7 November 2016

నీద్ర రావడం లేదని...

అలా ఆరు బయటకు వెళ్లాను...

కబుర్లు చెప్పే గాలులు..

ఊసులు చెప్పే ఆకులు...

కథలు చెప్పే జాబిలమ్మా...

నాకు ఎదురు పడ్డాయి అవి కూడా నిద్దర రాకతిరుగుతున్నాయి...

కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు.రాలుతున్నా పువ్వులను పోగేసుకుంటూ..

రేయంతా నీవు నా తోడుగా..

కాలమే తెలియని పరుగులు పెడుతూ గడిపా...


                                          - శ్రీనివాస్  చారీ 


Saturday, 15 October 2016




ఎంత అందమైనది ఈ ప్రపంచం......
 అందులోను ఒక స్త్రీ....
తల్లి పురిటి నొప్పులు భరించి మనల్ని కంటుంది...
జాగ్రత్తగా పెంచి పోషించి మనల్ని పెద్ద చేస్తుంది
తప్పు చేస్తే వారిస్తుంది.. తప్పటడుగులేస్తే తాట తీస్తుంది..
తప్పిపోతే ఆరా తీస్తుంది....

పెళ్ళీడుకొచ్చేదాకా ఎన్నో విషయాలు వంటింట్లో నొక్కి.. వినకపోతే ఒకటి పీకి చెప్తుంది....
తనకి మాట రాకూడదు  కదా....
తన కూతురు అత్తారింట్లో ఎలా ఉండాలో చిన్నప్పుడే తెలియజేస్తుంది...
తన అనుభవాలతో కలిపి....

వసంతం లో  విరగ బూసే సమయాన...
ఇంట్లో ఉండే కష్టాలు చూసి 
ఇల్లు గడవడం కోసం తను  సాయంగా ఉండాలనుకుంటుంది నాన్నకు...
ఎలాగైనా బయటకే పంపేది అలవాటవుతుందంటూ పంపిస్తుంది బాధతో తల్లి ..
నాలుగు నాలుగు వైపులా చూసే 'ఆ ' ఆశ చూపుల మొన్నల్లో నలుగుతూ ..
తనని తానూ కాపాడుకుంటూ... నడుస్తూ ఉంటుంది ....
చూసే 'ఆ ' ఆశ చూపుల  బావాలు మాటల్లో చెప్పలేక పోయినా మనసులో నాటుకున్నాయ్...
ఈ జనాలు... వాళ్ళ ఆలోచనలు... 
తన ప్రయాణానికి అడ్డంకులు కాకూడదని....

అడుగులేస్తూ... తీస్తూ... పరుగెడుతోంది  ఈ ప్రపంచం లోకి... 

తన చెరను పట్టే వాడి కోసం భయపడుతోంది....
ఎక్కడ ఏ  కీచకుడు పొంచి ఉన్నాడో అని...
ఎక్కడ ఏ అగాధం ఎదురొస్తుందో అని...

నిజంగా స్త్రీ కి నిరంతరం ఆపద నీడలా వెండిసిస్తుందేమో...

ఘనంగా పెళ్లి అయినా ... కొసరంత గర్వం కూడా లేకుండా సేవ  చేస్తుంది....
సూటి పోటీ మాటల తూటాలు ఒంట్లో దిగుతున్నా...
గుంభనగా ఉంటోంది....
అనుమానించే పక్షులు.. ఆకర్షించే నక్షత్ర రాక్షసులు...

అన్నీ...
అన్నీ...
తన జీవితంలో భాగం అయ్యాయేమో....
ఇంకెన్నాళ్లు ఓర్చుకోవాలో...
అందుకే నిరంతరం మండే అగ్ని ఆమె కళ్లల్లో కనపడుతోంది.. 
చిన్నారుల నవ్వుల్లో తన ప్రపంచాన్ని వెతుక్కుంటోంది...
తన భవిష్యత్ వారసత్వ పటాన్ని మనసులో నింపుకుంటుంది...
అన్యాయం అక్రమం .... అరాచకం... ప్రేమ....
అన్నీ భాగం అయ్యాయి...

అందుకేనెమో  
ఆమె దుర్గ దేవై చీల్చి చెండాడుతుంది..
గౌరి దేవై భర్తలో సాగ భాగం అవుతుంది..
గంగై ప్రేమతో పొంగుతుంది తన పిల్లల మీద....


                                                                           


                                                                                                                  -- శ్రీనివాస్ చారీ

 .

Friday, 14 October 2016

హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ?? 
అసలు నీకు అంత లేవేలేంటోయ్ ?? 
అయినా నేనంటే అంత అలుసోయ్??
నీకెందుకు మరీ ఇంత బెట్టు
నాపై కోపంగా వుంటే తిట్టు 
కల్లోకోస్తా నిన్ను కవ్విస్తా హత్తుకుపోతా
నీ పాటే వింటే ప్రణయ తాపం 
నీ మాటే మధుర గీతం 
నీ చూపే ప్రణవ నాదం 
నీ మోమే చంద్రుని ప్రతిబింబం 
నీ నీడై తోడై ఉంటా 
నా జన్మ కాచుకుంటా 
గుండెల్లోన చేరి గుచ్చి చంపకోయ్ 
కళ్ళతోటి నన్ను కాల్చకోయ్ 
నీ మాటలే పూ తోటలై నా ముంగిట విరిసేనోయ్
ఆ పూలనే పూల మాలగా నీకై నే మలిచానోయ్ 
హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ?? 
నీ దిండు పంచుకుంటా 
నా ప్రేమ పంచుకుంటా 
చల్లగాలై తాకి సేద తిర్చవా 
వెండి వెన్నెలవై వడిలో వాలవా
నా ఊపిరివై నాలో నిండిపోవా

హలో బావోయ్
కొంచెం మనసు మార్చుకోవోయ్ ??